Header Banner

గ్రేటర్‌ విశాఖ కొత్త మేయర్‌పై కసరత్తు.. టీడీపీ, జనసేన మధ్య చర్చలు! ఆయనే ఫైనల్..!

  Sat Apr 19, 2025 18:00        Politics

గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరు..? డిప్యూటీ మేయర్ ఎవరు అనేదానిపై దృష్టిసారించింది.. మేయర్, డిప్యూటీ మేయర్ పై టీడీపీ, జనసేన మధ్య చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. 96వ వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది.. ఇక, డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు లభించే అవకాశం ఉడగా.. డిప్యూటీ మేయర్ జియ్యానీ శ్రీధర్ పై ఇచ్చిన అవిశ్వాసంపై ఈనెల 26వ తేదీన ఓటింగ్ జరగబోతోంది.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఖాళీ అయిన తర్వాత ఎన్నికల సంఘానికి..

కొత్త మేయర్, డిప్యూటీ మేయర్పేర్లను పంపించనుంది ప్రభుత్వం.. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి గరిష్టంగా నెల రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు... జీవీఎంసీ మేయర్ పీఠాన్ని సీఎం చంద్రబాబుకు గిఫ్టుగా ఇచ్చాం.. సంవత్సరకాలం ఉండగా విశ్వాసం ఎందుకు పెట్టారని కొందరు అన్నారు. విశాఖ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అవిశ్వాస తీర్మానానికి వెళ్లామని తెలిపారు.. అవిశ్వాస తీర్మానం విజయానికి జిల్లా ప్రభుత్వ ప్రతినిధులు ఎంతో కృషి చేశారు. అందరం సమిష్టిగా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం అన్నారు పల్లా శ్రీనివాసరావు.


ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Visakhapatnam #GVMCMayor #TDP #Janasena #AndhraPolitics #ChandrababuNaidu